కేటీఆర్ ట్విట్టర్ టిల్లు.. నాలెడ్జ్ నిల్లు: Revanth Reddy సెటైర్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. అసలు మంత్రి కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. దుడ్లు, బడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలియదని సెటైర్లు వేశారు. కేటీఆర్ ట్విట్టర్ టిల్లు.. నాలెడ్జ్ నిల్లు అని ఎద్దేవా చేశారు. ఇక, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్‌ను ఎక్కడ దొరికితే అక్కడ అడ్డుకోండని రేవంత్ సూచించారు. రైతు వేదికల దగ్గర బీఆర్ఎస్ నేతలను చెట్లకు కట్టేయండని.. హామీలు అమలు చేసేదాకా ఎమ్మెల్యేలను వదలొద్దని రేవంత్ పిలుపునిచ్చారు.