పోడు భూముల సమస్యను పరిష్కరించేది కాంగ్రెస్సే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

పోడు భూముల సమస్యను పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-02-12 13:33 GMT

దిశ, అశ్వాపురం: పోడు భూముల సమస్యను పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మీదుగా సాగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. కౌలు రైతులకు అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. చాలా జిల్లాల్లో వివాదాస్పద భూములన్నాయని, వాటికి సంబంధించిన రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదముందన్నారు. లేకుంటే షార్ట్ సర్క్యూట్ పేరుతో వాటిని నామరూపాల్లేకుండా చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫామ్ హౌజ్ కేసును సైతం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News