సీఎం కేసీఆర్ సొంతూరులో గుడి, బడి కట్టించిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి
పాలమూరులో వలసలు ఆగలేదు, ఎక్కడి వెళ్లిన వలస వెళ్లిన పాలమూరు బిడ్డలే కనబడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం
దిశ, వెబ్‌డెస్క్: పాలమూరులో వలసలు, ఆత్మహత్యలు ఆగలేదు, ఎక్కడి వెళ్లిన వలస వెళ్లిన పాలమూరు బిడ్డలే కనబడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. పాలమూరు పల్లెలు బాగుపడతాయని కేసీఆర్‌ను గెలిపించుకున్నాం, ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు పాలమూరుకు చేసింది ఏంటని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు, ఎందుకు గిరిజనులను ఆదుకునే ప్రయత్నం చేయలేదని రేవంత్ నిలదీశారు. ఓట్లు కొనుగోలు చేసి మరోసారి అందలం ఎక్కాలని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని అన్నారు. కానీ డిసెంబర్ 9న తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.
దొరల రాజ్యాన్ని బొందపెట్టి.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామన్నారు. మా మంచితనాన్ని అవమానించినవారినీ ఎవరిని వదలమని హెచ్చరించారు. కాంగ్రెస్ హయంలోనే మేజర్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి.. కాంగ్రెస్ హయాంలోనే 70 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయని అన్నారు. ఆఖరికి సీఎం కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకలో బడి, గుడి, రోడ్డు వేసిందే కాంగ్రెస్ అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, ప్రపంచానికి ఐటీ రంగ నిపుణులను ఎగుమతి చేసింది ఇందిరమ్మ రాజ్యమని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్లీ పాడి పంటలు వస్తాయన్నారు.
Read More..
సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్ (వీడియో)