BJP ఆఫీస్‌పై దాడి.. కాంగ్రెస్ నాయకులపై మహేశ్ కుమార్ సీరియస్
యూత్ కాంగ్రెస్(Youth Congress) నాయకులకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar) తీవ్ర హెచ్చరికలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: యూత్ కాంగ్రెస్(Youth Congress) నాయకులకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar) తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని చురకలు అంటించారు. బీజేపీ నేతల(BJP) వ్యాఖ్యలు ఖండించాల్సిందే.. కానీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కరెక్ట్ కాదని సీరియస్ అయ్యారు. ఇదే అదునుగా భావించి గాంధీ భవన్‌పై బీజేపీ నేతలు దాడి చేయడం కూడా సరైందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిధూరీ(Ramesh Bidhuri) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress) పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో రెచ్చిపోయిన టీ.కాంగ్రెస్ యూత్ లీడర్స్.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌పై దాడికి యత్నించారు. తాజాగా.. వారిపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.