Mahesh Kumar Goud: బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయి.. మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజం
కిషన్ రెడ్డి బస్తీ నిద్ర అటెన్షన్ డైవర్ట్ కోసమేనని టీపీసీసీ చీఫ్ దుయ్యబట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని అందువల్లే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధికి ఏడాది కాంగ్రెస్ పాలనలోని అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు దఫాలుగా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించారన్నారు. శనివారం హనుమకొండలో పర్యటించారు. 19న వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ సభ నేపథ్యంలో సభపై సమన్వయ సమావేశం నిర్వహించగా ఈ మీటింగ్ కు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫర్మార్మెన్స్ జీరో అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇవ్వగలిగానమని మరో 8 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన దానికంటే ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో రైతులకు రుణమాఫీ చేసి చూపించామన్నారు.
మూసీ నిద్రవల్ల ఒరిగేదేమి ఉండదు:
ప్రజలను డైవర్ట్ చేయడానికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ మూసీ నిద్ర వల్ల ఒరిగేదేమి ఉండదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ నేపథ్యంలో ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో కిషన్ రెడ్డి నిద్ర చేయబోతున్నారు. దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్.. కిషన్ రెడ్డి ఒక్క రోజు నిద్ర చేస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.