Breaking News : ఆయనే మా సీఎం... బాంబ్ పేల్చిన టీపీసీసీ చీఫ్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-02-17 12:31 GMT
Breaking News : ఆయనే మా సీఎం... బాంబ్ పేల్చిన టీపీసీసీ చీఫ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లు ఆయనే మా సీఎం అంటూ బాంబ్ పేల్చారు. నేడు గాంధీ భవన్లో ఏఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్(Ajay Singh) తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి(BC CM in Telangana) అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ ధృడ సంకల్పంతో ఉన్నారని.. అందులో భాగంగా ఏదోకరోజు బీసీల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాబోతున్నారని.. ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో అన్ని ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయని స్పష్టం చేశారు. రానున్న కేబినెట్ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణన(Cast Census) చేపట్టామని.. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా చూడాలని అన్నారు. తాము తీసుకువస్తున్న బీసీ రిజర్వేషన్స్ బిల్లు(BC Reservations Bill)ను ప్రధాని మోడీని ఒప్పించి 9వ షెడ్యూల్ లో పెట్టేలా చూడాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కి సవాల్(Challenge to Bandi Sanjay) విసిరారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా మోడీతో మాట్లాడాలి అంటూ బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు.  

Tags:    

Similar News