Breaking News : నేటి ఇంటర్మీడియెట్ ప్రశ్నపత్రం క్వాలిటీ లోపం ఘటన... ఇంటర్ బోర్డు కీలక ప్రకటన

తెలంగాణలో నేడు జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల(Intermediate Public Exam) ప్రశ్నాపత్రంలో నెలకొన్న గందరగోళంపై ఇంటర్ బోర్డు(Board Of Intermediate) కీలక ప్రకటన జారీ చేసింది.

Update: 2025-03-10 16:06 GMT
Breaking News : నేటి ఇంటర్మీడియెట్ ప్రశ్నపత్రం క్వాలిటీ లోపం ఘటన... ఇంటర్ బోర్డు కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేడు జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల(Intermediate Public Exam) ప్రశ్నాపత్రంలో నెలకొన్న గందరగోళంపై ఇంటర్ బోర్డు(Board Of Intermediate) కీలక ప్రకటన జారీ చేసింది. సోమవారం జరిగిన ఇంగ్లీష్ రెండవ సంవత్సరం(English 2nd Paper) ప్రశ్నాపత్రంలో 7వ ప్రశ్నలో పై చార్ట్ కు సంబంధించిన ప్రశ్నలో కొంత మంది విద్యార్ధుల ప్రశ్నాపత్రంలో ముద్రణలో గీతల అస్పష్ఠతను(Printing Errors) గుర్తించినట్లు బోర్డు వారి దృష్ఠికి తీసుకురావడం జరిగింది. దీనిపై సబ్జక్ట్ నిపుణులు విపులంగా చర్చించారు. విద్యార్ధులకు న్యాయం చేయాలనే సంకల్పంతో జవాబును సమాధాన పత్రంలో రాయడానికి ప్రయత్నించిన వారందరికీ ప్రశ్నకు కేటాయించిన మార్కులు ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడినట్టైంది.

కాగా నేడు జరిగిన పరీక్షలో క్వశ్చన్ పేపర్‌లో చాట్ ఆధారంగా ఇచ్చిన 7 ప్రశ్నకు ప్రింట్ లోపం ఏర్పడింది. ప్రశ్నపత్రంలోని ఏడో ప్రశ్నలో డిస్టింగ్‌క్షన్, మెరిట్, పాస్, ఫెయిల్ అనే ఆప్షన్స్ గుర్తించే వీల్లేకుండా అంటే కనిపించకుండా ప్రింట్ వచ్చింది. ఇన్విజిలేటర్స్ ని స్టూడెంట్స్ అడిగితే అందరికీ అలాగే ప్రింట్ వచ్చిందని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇంటర్ ప్రశ్నాపత్రం ప్రింటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల 4 మార్కులు నష్టపోతున్నారని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రింటింగ్‌లో క్వాలిటీని పెంచాలని స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంటర్ బోర్డును కోరారు.

Tags:    

Similar News