నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. జాబ్ నోటిఫికేషన్లపై మంత్రి కీలక ప్రకటన
దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha)ను.. ఆయన నివాసంలో కలిసి బుడగ జంగాల కుల
దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha)ను.. ఆయన నివాసంలో కలిసి బుడగ జంగాల కుల సంఘం(Beda Budga Jangam Community) ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ‘మొత్తం షెడ్యూల్డ్ కులాల్లో బుడగ జంగాల అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా కూడా అత్యంత వెనకబడి ఉన్నారు. అందుకే మీ కులాన్ని అత్యంత వెనుకబడిన గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. ఈ గ్రూపునకు జనాభాకు మించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరంతా మీ పిల్లలను మంచిగా చదివించుకోవాలి. ఆత్మగౌరవంతో బతకాలి. ఎవరైనా ఏదైనా చెబితే, మంచి చెడు తర్కంగా ఆలోచన చేయాలి. ఒకరినొకరు తిట్టుకోవడం, కించపర్చుకునే విధానం మంచిది కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలి’ అని మంత్రి సూచించారు.
అంతేకాదు.. ‘ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందాలి. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు(Job Notifications) విడుదల అవుతాయి. వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వ్ చేయబడుతాయి. ఆ ఉద్యోగాలు పొందేలా మీ పిల్లలను సిద్ధం చేయండి. వారికి మంచి చదువు చెప్పించండి, కోచింగ్ ఇప్పించండి. మీకు అవసరమైన సహకారం అందించే బాధ్యత మాది, ప్రభుత్వానిది’ అని మంత్రి దామోదర రాజనర్సింహా కీలక సూచనలు చేశారు.
For Scrolling/Breaking
— Damodar Raja Narasimha (@DamodarCilarapu) March 28, 2025
దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారిని, వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన బుడగ జంగాల కుల సంఘం ప్రతినిధులు, యువకులు..
ఈ సందర్భంగా మంత్రి వారందరికి శుభాకాంక్షలు తెలిపారు.
మొత్తం షెడ్యూల్డ్ కులాల్లో… pic.twitter.com/Ta4w6RYOLA