World Meditation Day : నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం..హాజరుకానున్న సీఎం, గవర్నర్

ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవం(First World Meditation Day)గా నిర్వహించాలని తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో నేడు ప్రపంచ దేశాలు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి

Update: 2024-12-21 05:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవం(First World Meditation Day)గా నిర్వహించాలని తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో నేడు ప్రపంచ దేశాలు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు హాజరుకానున్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వాహణకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

ప్రతీ సంవత్సరం ధ్యాన దినోత్సవం నిర్వాహణలో భాగంగా ఏటా ఒక థీమ్ ఎంచుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇన్నర్ పీస్, గ్లోబల్ హార్మొనీ అనే థీమ్ ఎంచుకున్నారు. మనసు లోపల శాంతి, ప్రపంచానికి సామరస్యం అనే మంచి ఆలోచనతో ధ్యాన దినోత్సవం నిర్వహించనున్నారు. నిత్యం బిజీ లైఫ్‌స్టైల్‌తో టెన్షన్ పడుతున్న యువతకు ఒత్తిడి నుంచి ఉపశమనం అందించేందుకు మెడిటేషన్ మంచి సాధనలా మారగలదని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News