దిశ, ఫీచర్స్: కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారకరామారావు 1976 జూలై 24 న సిద్ధిపేటలో జన్మించారు. కేటీఆర్ తన చదువు మొత్తం బోర్డింగ్ స్కూల్‌లోనే ఎక్కువగా చదివారు. ఆయన 10 ఏళ్లలోనే 7 పాఠశాలలను మారారు. రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలను కలిగి ఉన్నారు. ఒకటి న్యూయార్క్ యూనివర్సిటీ మరొకటి పుణెలో బయోటెక్నాలజీలో పొందారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఐటీపై పట్టు, ఇంటర్నేషనల్ లెవెల్లో అనుభవం ఉండటంతో అతని దృష్టి మొత్తం రాజకీయాల వైపు వెళ్ళింది. 2006 లో టీఆర్‌ఎస్ లో చేరి తనదైన ముద్ర వేసుకున్నారు. కేటీఆర్ ఐటీ, వాణిజ్య శాఖగా మంత్రిగా క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నేడు ఆయన 48 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు సెలబ్రిటీలు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.