Cyber: ఆ మోసం బారిన పడొద్దంటే ఏం చేయాలి..? తెలంగాణ పోలీస్ అవగాహన ట్వీట్

డిజిటల్ అరెస్ట్(Digital Arrest) భారిన పడొద్దంటే ఏం చేయాలి అని తెలంగాణ పోలీస్(Telangana Police) ట్వీట్ చేసింది.

Update: 2024-12-28 12:58 GMT

దిశ, వెబ్ డెస్క్: డిజిటల్ అరెస్ట్(Digital Arrest) భారిన పడొద్దంటే ఏం చేయాలి అని తెలంగాణ పోలీస్(Telangana Police) ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇందులో సైబర్ నేరాలపై(Cyber Crimes) అవగాహన పెంచుకోండి అని, అపరిచిత కాల్స్(Unknown Calls), మెసేజ్‌లతో అప్రమత్తంగా(Be- Alert) ఉండాలని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలను నమ్మొద్దని, అపరిచిత లింక్స్(Unkown Links) ను అస్సలు క్లిక్ చేయొద్దని హెచ్చిరించింది. అంతేగాక డిజిటల్ అరెస్ట్ పద్దతి లేదని గుర్తుంచుకోవాలని చెబుతూ.. సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 కు ఫిర్యాదు చేయాలని వివరించింది. ఇక దీనిపై డిజిట‌ల్ అరెస్ట్ పేరిట‌న ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మోసాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి అని, డిజిట‌ల్ అరెస్ట్ అనే వ్య‌వ‌స్థ లేద‌ని గుర్తుంచుకోండి అని చెబుతూ.. అవ‌గాహ‌న‌తోనే సైబ‌ర్ నేరాల‌కు అడ్డుక‌ట్ట వేయొచ్చని సూచించింది.

Tags:    

Similar News