MLC ఎన్నికల్లో ఓటు వేసిన తీన్మార్ మల్లన్న, ఏనుగు రాకేష్ రెడ్డి (వీడియో)
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. కాగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, భార్యతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 459 బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ ప్రెస్టన్ కాలేజీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సూర్యాపేటలో మాజీ జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది.