కేటీఆర్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు డుమ్మా

తెలంగాణ భవన్‌లో జరిగిన కేటీఆర్ మీటింగ్‌కు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి

Update: 2023-12-04 13:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో జరిగిన కేటీఆర్ మీటింగ్‌కు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డిలు కేటీఆర్ మీటింగ్‌కు హాజరు కాలేదు. ఈ ముగ్గురు కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించిన సమావేశానికి వీరు దూరంగా ఉండటంతో పొలిటికల్ సర్కిల్‌లో రకరకాల ఉహాగానాలు మొదలయ్యాయి. అయితే కార్యకర్తలతో బిజీగా ఉండటం వల్లే ఈ మీటింగ్‌కు హాజరు కాలేదని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సమావేశం ముగియగానే పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కేటీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలవబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News