'కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదు'

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-04-21 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబానికి నిద్ర ఉండదని, కేసీఆర్ కుటుంబం చేసిన స్కాములన్నీ బయటకు వస్తాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు. 24 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ పై ప్రజలు తిరగబడతారన్నారు. మల్లన్న సాగర్ లో కుంభకోణాల చిట్టా విప్పుతామని దోషులను శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులను రాసి రంపాన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు.

Tags:    

Similar News