సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లది మానసిక వైఖల్యమే : Revanth Reddy

హైదరాబాద్​ 8వ నిజాం నవాబ్​ మీర్​ బర్కత్​ ఆలీఖాన్​ ముకర్రం జా పార్థీవ దేహాన్ని బుధవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు సందర్శించారు.

Update: 2023-01-18 07:29 GMT

దిశ, చార్మినార్ : హైదరాబాద్​ 8వ నిజాం నవాబ్​ మీర్​ బర్కత్​ ఆలీఖాన్​ ముకర్రం జా పార్థీవ దేహాన్ని బుధవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు సందర్శించారు. నిజాం పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 8వ నిజాం అంత్యక్రియలు అధికార లాంఛనంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. అధికార లాంఛనంగా 8వ నిజాం అంత్యక్రియలు నిర్వహించడాన్ని కొంతమంది తప్పు పట్టాడాన్ని వారి మానసిక వైఖల్యమే కారణమని, సరైన అవగాహన లేకుండా మాట్లాడడమే కారణమన్నారు.

ఇప్పుడున్న రాజకీయ నాయకులు కేవలం 5,10 సంవత్సరాలు మాత్రమే పాలన చేసి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అసఫ్ జాహీ నిజాం నవాబులు హైదరాబాద్ సంస్థానాన్ని 220 సంవత్సరాలు పాలన చేసి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధికోసం ఎన్నో ప్రాజెక్టులు, ఉస్మానియా యూనివర్సిటీలు, పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు.నిజాం రాజుల భూములను కాపాడాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం విక్రయస్తూ సొమ్ము చేసుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 8 వ నిజాం ముఖర్రం జా పేరు మీద చిరస్థాయిగా నిలిచేలా ఓ మంచి కార్యక్రమం చేపట్టాలని, ముందుగా అసెంబ్లీలో చర్చ జరుపాలని కోరారు. నిజాం భౌతిక ఖాయాన్ని సందర్శించి, నివాళులర్పించిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫెరోజ్ ఖాన్, సమీర్ వలీ ఉల్లా, ఉజ్మా షకీర్, కె.వెంకటేష్, కెఎస్ ఆనంద్ రావులు ఉన్నారు.

Tags:    

Similar News