కాంగ్రెస్ వస్తే జరిగేది ఇదే.. మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-11-14 07:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏబుల్ లీడర్ షిప్, స్టేబుల్ గవర్నమెంట్ అవసరమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులు మారడం ఖాయమన్నారు. మంగళవారం తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారన్నారు.

ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటీ ఎగుమతుల్లోనూ మనం గణనీయమైన గ్రోత్‌ను సాధించామని చెప్పారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని కూడా హైదరాబాద్ నగరం రెండేళ్ల నుంచి దాటి పోయిందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా ఉన్నామన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకు రావాలని ఆయన కోరారు.

హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని కేటీఆర్ అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు మాత్రమే కాదు రీజనల్ రింగ్ రోడ్డులు కూడా వస్తాయని, హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ చూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అన్నారు. హైదరాబాద్ నగరానికి రోజూ తాగునీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్‌లో చేపడతామని తెలిపారు. రాష్ట్రానికి హైదరాబాద్ ఎకనామిక్ ఇంజిన్ వంటిదన్నారు. కర్ణాటక‌లో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లయిందిన్నారు.

Tags:    

Similar News