Akunuri Murali : సుపరిపాలన అంటే ఇది కదా.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై రిటైర్డ్ ఐఏఎస్ రియాక్ట్
హదరాబాద్‌లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: హదరాబాద్‌లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం కూల్చి వేసింది. దీనికి సంబంధించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఎక్స్ వేదికగా స్పందించారు.
‘ఇది సుపరిపాలన అంటే. వినడానికి బాగుంది. ఇలాంటివి చూస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పెద్దా/ చిన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా (అధికార పార్టీతో సహా) ఇల్లీగల్‌గా కట్టినవన్నీ అందరివీ కూల్చేయండి. పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా ప్రాసిక్యూట్ చెయ్యండి’ అంటూ తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేసి కీలక సూచనలు చేశారు. కాగా, మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు నటుడు నాగార్జున పై ఆరోపణలు ఉన్నాయి.