ఓయూలో తాగునీటి కొరతపై జలమండలి రియాక్షన్ ఇదే..!

ఓయూలో తాగు నీటి కొరతపై జలమండలి స్పందించింది.

Update: 2024-04-29 17:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓయూలో తాగు నీటి కొరతపై జలమండలి స్పందించింది. ఓయూ వీసీతో జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఒప్పందం కంటే అదనంగా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఓయూ అధికారులు కోరిన పరిణామం 505 కేఎల్‌డీ అని..ప్రస్తుతం ఓయూకు 1271 కేఎల్‌డీ సరఫరా చేస్తున్నామన్నారు. నీటి కొరతకు జలమండలితో సంబంధం లేదన్నారు. ఇక, గత ఐదు రోజులుగా ఓయూలో తాగు నీరు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టగా ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని విద్యార్థులు ఆందోళన చెందవద్దని తెలిపారు.  


Similar News