Formula E race : నేడు హైదరాబాద్ వేదికగా తొలి ఫార్ములా ఈ రేసింగ్

హైదరాబాద్ వేదికగా మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ నేడు(శనివారం) జరగనుంది.

Update: 2023-02-11 02:34 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వేదికగా మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ నేడు(శనివారం) జరగనుంది. హుస్సేన్ సాగర్ తీరాన స్ట్రీట్ సర్క్యూట్‌పై రేసింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 8 సీజన్‌లు విజయవంతంగా ముగియగా 9వ సీజన్‌లో నాలుగో రేసుకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. 22 మంది డ్రైవర్లు పాల్గొటున్న ఈ ఫార్ములా రేసింగ్‌లో భారత్ నుంచి మహీంద్రా రేసింగ్ బరిలో ఉంది. లూకాస్ డి గ్రాసి, ఒలివర్ రోలాండ్‌లు ప్రధాన డ్రైవర్లు కాగా భారత్‌కు చెందిన జెహాన్ దారువాలా రిజర్వ్ డ్రైవర్‌గా జట్టులో ఉన్నాడు.

2.835 కిలోమీటర్ల పొడవు, 18 మలుపులు, 21వేల మంది కూర్చునే సామర్థ్యంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను ఇప్పటికే నిర్వాహకులు సిద్ధం చేశారు. ఉదయం 10.40కి ఫార్ములా ఈ క్వాలిఫయింగ్ రేస్ జరగనుంది. మధ్యాహ్నం 3.03 నుంచి సాయంత్రం 4.30వరకు మెయిన్ రేస్ జరపనున్నారు. గంటకు 322 కిలోమీటర్ల హై స్పీడ్‌తో ఫార్ములా కార్లు రేస్ లో పాల్గొననున్నాయి. దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఇవెంట్ జరగనుంది.

Tags:    

Similar News