కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షర్మిల ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాఆర్టీపీ పార్టీని షర్మిల గురువారం విలీనం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాఆర్టీపీ పార్టీని షర్మిల గురువారం విలీనం చేశారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. వైఎస్సాఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారని.. తాను తండ్రి వైఎస్సాఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లో చేరినందుకు గర్వ పడుతున్నానని.. ఈ రోజు నుంచి వైఎస్సాఆర్టీపీ కాంగ్రెస్‌లో ఓ భాగమన్నారు.
సెక్యులర్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేనందు వల్లే మణిపూర్ అల్లర్లు జరిగాయన్నారు. మణిపూర్‌లో 2వేల చర్చిలను ధ్వంసం చేసిన ఘటన తనను కలిచివేసిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన లక్ష్యమని స్పష్టం చేశఆరు. తనకు కాంగ్రెస్ హై కమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా చేపడతానని.. ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా తాను పనిచేయడానికి సిద్ధమే అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్లే కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ జోడో యాత్ర తనతో పాటు ప్రజల్లో విశ్వాసం నింపిందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదన్నారు.
Read More: బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరిన షర్మిల