ఈడీ నోటీసులు.. MLC కవిత సంచలన నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కవిత స్పందించారు. మోడీ నోటీసులు అందాయన్నారు. రేపు ఈడీ విచారణకు హాజరు కావడం లేదన్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారన్నారు. ఈడీ నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నోటీసును పార్టీ లీగల్ టీమ్‌కు ఇచ్చామన్నారు. ఇది ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉందన్నారు. టీవీ సీరియల్‌లా దీన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చాయి.. మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారన్నారు. నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. ఏడాదిగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదన్నారు. ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారన్నారు. మేం ఎవరికీ బీ-టీమ్ కాదు. తెలంగాణ, దేశ ప్రజలకు ఏ-టీమ్ అని కవిత అన్నారు.