వాళ్ళు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు.. ప్లీజ్ రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లండంటూ హేమ పోస్ట్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-20 15:21 GMT

దిశ, సినిమా: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కోసం అరెస్ట్ కూడా చేసి జైల్లో పెట్టగా.. బెయిల్ మీద బయటకు వచ్చింది. దీంతో ఆమెపై వచ్చిన ఆరోపణల కారణంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఈ విషయంపై ఆమె మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసింది. ఇక రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయినప్పటికీ నుంచి సోషల్ మీడియాకు దూరం అయిన ఆమె.. మళ్లీ యాక్టివ్ అయింది. వరుస పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తుంది.

తాజాగా, హేమ వరుసగా నాలుగు వీడియోలు పెట్టి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘నన్ను ఒక టెరరిస్ట్‌లాగా జీహాద్‌కు వర్క్ చేసి దానిలా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది. నేను ప్రముఖుల దగ్గరకు ఎలా వెళ్లాలి. వాళ్లని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియడం లేదు అందుకే ఈ వీడియో పెడుతున్నాను. నన్ను మీడియా వాళ్లు బ్లాక్ మెయిల్ చేశారు. కొంతమంది సెటిల్‌మెంట్ రమ్మని అడిగారు. పెద్దవాళ్లు కాంప్రమైజ్ చేస్తానని అన్నారు. నాకు మీడియా వాళ్లకి ఎలాంటి గొడవలు లేవు. నేనెందుకు రావాలి నేను తప్పు చేయలేదు. బ్లాక్ చేసిన వాళ్ల నెంబర్లు కూడా ఉన్నాయి. తొందరలో అప్డేట్ చేస్తాను. నా వాయిస్‌ను రేవంత్ రెడ్డి వరకు తీసెకెళ్లండి ప్లీజ్. ఆ బాధ్యత నాకు సపోర్ట్ చేసే అన్నాదమ్ములు మీ మీదనే ఆధారపడి ఉంది. ప్లీజ్ నన్ను తీసుకెళ్లండి’’ అని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News