రుణమాఫీపై గతంలో గైడ్ లైన్స్ ఇవే.. హరీష్‌రావు పాత జీవోల ఫోటోలు పోస్ట్

Update: 2024-07-16 15:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియకు సిద్దమైంది. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలసిందే. ఈ గైడ్ లైన్స్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన రుణమాఫీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన రుణమాఫీపై ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ఉత్తర్వుల ఫోటోలు పోస్ట్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చి పీఎం కిసాన్ డేటా ఆధారంగా, రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే, అది కూడా కుటుంబంలో ఒకరి మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం శోచనీయమని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, లేకపోతే రైతులను మోసం చేసినట్లు అని కోరారు. రేషన్ కార్డు తప్పనిసరి అని ఇప్పటికే చాలా పథకాలకు కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను కూడా ఇలా వంచించడం అన్యాయం అని జీవోల ఫోటోలు పంచుకున్నారు.


Similar News