అప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించలేదేం?.. కవితపై మల్లురవి ధ్వజం

కవితపై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-02-03 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు పూలే గుర్తురాలేదా? అని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.మల్లురవి విమర్శించారు. ప్రజాభవన్ కు పూలే పేరు పెట్టాక గుర్తొచ్చిందా? అని నిలదీశారు. అసెంబ్లీ ఆవరణంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత చేస్తున్న డిమాండ్ పై స్పందించిన మల్లురవి.. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని, మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని ధ్వజమెత్తారు. ఐదేళ్లు మహిళలకు కేబినెట్ లో అవకాశం ఇవ్వనప్పుడు .. కేసీఆర్ ను కవిత ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండి నిర్మాణత్మక విమర్శలు చేయాలే తప్ప... మాయ మాటలు కాదన్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందన్నారు. సీఎం ఓ నుండి కమిషనర్ల వరకు, సింగరేణి నుండి హెల్త్ డైరెక్టర్ ల వరకు.. సామాజిక న్యాయం పాటించామన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా తమది ప్రజా ప్రభుత్వం అని భావిస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News