మద్యం మత్తులో పోలీసులకు యువకుడి షాక్.. ఏకంగా..
మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు షాక్‌కు గురయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు షాక్‌కు గురయ్యారు. గద్వాల-ఎర్రవల్లిలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేస్తున్నాడని కానిస్టేబుల్ పోలీసు వాహనంలో అక్కడికి చేరుకున్నాడు. పోలీసు వాహనాన్ని హైవే పక్కకు నిలిపి ఆ యువకుడిని పక్కకు పంపాడు. ట్రాఫిక్ ను క్లియర్ పని చేసే నిమగ్నమయ్యాడు. అయితే కాసేపటికి చూసే సరికి పెట్రోలింగ్ వాహనంతో యువకుడు జంప్ అయ్యాడు. మద్యం మత్తులో యువకుడు ఆ వాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తేల్చారు. చివరకు కొదండపురంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.