చెరువుగా మారిన విజయవాడ హైవే! నగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Update: 2024-05-18 13:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే వనస్థలిపురంలో చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది.

దీంతో పనామా ఎల్బీనగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..