పద్మశ్రీ మొగులయ్య స్థలం గోడను కూల్చిన దుండగులు.. కన్నీరు పెట్టుకుంటూ వేడుకోలు

కొద్దిరోజుల క్రితం భారత ప్రభుత్వం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డును ఇచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-11 08:33 GMT

దిశ, వెబ్‌‌డెస్క్/ఎల్బీనగర్: కొద్దిరోజుల క్రితం భారత ప్రభుత్వం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డును ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను ఆర్దికంగా ఆదుకునేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్‌లో 600 గజాల స్థలాన్ని కేటాయించింది. దీనిని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఆ స్థలంలో మొగులయ్య సొంత ఖర్చుతో కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకున్నాడు. కాగా ఆ వాల్‌ను గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న మొగులయ్య తన స్థలం వద్దకు చేరుకొని, తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని వేడుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కూలిన కాంపౌండ్ వాల్‌ను పరిశీలించారు. ఈ సమయంలో పద్మశ్రీ మొగులయ్య తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసుల ముందు కంటతడి పెట్టుకున్నారు. దీంతో పోలీసులు స్థానికుల సహాయంతో వివరాలను సేకరించే పనిలో పడ్డారు.  


Similar News