కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలి!.. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఆసక్తికర ట్వీట్

ఉద్యోగ అవకాశాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించాలని మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ ప్రోఫెసర్. ఘంటా చక్రపాణి కోరారు.

Update: 2024-07-17 10:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగ అవకాశాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించాలని మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ ప్రోఫెసర్. ఘంటా చక్రపాణి కోరారు. కర్ణాటకలో ఉన్న ప్రైవేట్ కంపెనీలలోని ఉద్యోగాలలో స్థానికులకి రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికై కేజినేట్ ఆమోదం కూడా తెలిపింది. దీనిపై ఘంటా చక్రపాణి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలలో 50 నుంచి 75 శాతం స్థానిక రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మానేజ్మెంట్ పోస్టులు, టాప్ జాబ్స్ లో 50 శాతం, ఇతర ఉద్యోగాల్లో 75 శాతం అవకాశాలు అన్ని కంపెనీలు ఇకపై కన్నడ స్థానిక యువతకే ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

ఇది నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం కాబోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఇది అనివార్యం అని చెబుతూ.. తెలంగాణా ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించాలని కోరారు. ఇటువంటి విధాన నిర్ణయం ప్రకటించి, స్థానిక యువతకు కావలసిన నైపుణ్యశిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే వారిని మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా తయారుచేస్తే తెలంగాణలో కూడా కనీసం పదిలక్షల మందికి ప్రైవేటురంగంలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. రేపటి కోసం ఆలోచించాలని ఘంటా చక్రపాణి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Similar News