యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం: ప్రియాంక గాంధీ
తెలంగాణ మీకు నేల కాదు.. తల్లిలాంటిదని.. ఈ నేల కోసం వందల మంది ప్రాణం త్యాగం చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మీకు నేల కాదు.. తల్లిలాంటిదని.. ఈ నేల కోసం వందల మంది ప్రాణం త్యాగం చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. శనివారం టీ కాంగ్రెస్ సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన యువ సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రియాంక గాంధీ ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం ఉద్యమించారు.. ప్రత్యేక తెలంగాణ కోసం కలలుగన్నారు.. ప్రాణాలు ఆర్పించి చివరకు సాధించుకున్నారని అన్నారు. యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాధ్యమైందన్నారు. దేశం కోసం నా కుటుంబ సభ్యులు కూడా కూడా అమరులయ్యారని.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలసన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా గాంధీ ఎంతో మథనం చేశారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాలన్న తపన సోనియాకు ఉందన్నారు.