రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్దే.. టీడీపీ రాష్ట్ర నాయకులు

రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూనే తెలంగాణరైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని టీడీపీ రాష్ట్రనాయకులు మండిపడ్డారు.

Update: 2023-06-15 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూనే తెలంగాణరైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని టీడీపీ రాష్ట్రనాయకులు మండిపడ్డారు. పండించిన పంటను అమ్ముకోలేని దుస్తితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. మార్కెట్ యార్డులకు రైతులు తరలించిన పంటలను రక్షించలేని పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుబారా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బును రైతుల సంక్షేమానికి ఖర్చుచేస్తే బాగుడేందన్నారు. బడ్జెట్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చినందు వల్ల రైతులు ధర్నాలు చేస్తే వారికి బేడీలు వేయడం తెలంగాణ పురోగతా? అని ప్రశ్నించారు. రక్షణ కవచంగా, ఫ్రంట్లైన్ వారియర్స్ గా ఉన్న హోంగార్డులకు ఇచ్చిన హామీలను విస్మరించడం అన్యాయమన్నారు.

శాసనసభలో హెూంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని ఏళ్లుగడుస్తున్నా అతీగతీ లేదన్నారు. ఎన్నికలకు ముందు బీసీలకు రూ. లక్ష లోన్అని చెప్పి మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి బొందల తెలంగాణగా కేసీఆర్ మారుస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, అధికార ప్రతినిధి ఏ.ఎస్ రావు, తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి తులసి పాల్గొన్నారు.

Tags:    

Similar News