సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీచర్ల వినతి
వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఎస్జీటీ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఎస్జీటీ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్‌ను ఎస్జీటీ బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వినోద్ కుమార్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పది వేలు పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరామన్నారు. విద్యర్థులకు నోటు పుస్తకాలు, వర్క్‌బుక్‌లతో పాటు షూ, టై, బెల్టు, బ్యాగ్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఖాళీలను నూతన డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read More: నేడు, రేపు జాగ్రత్త.. తెలంగాణలో పెరగనున్న ఎండ తీవ్రత