మునుగోడులో కాంగ్రెస్‌కు కలిసిరానున్న 'ఆపరేషన్ ఫాంహౌస్'
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్మరింత స్పీడ్పెంచుతోంది. ఓ వైపు రాహుల్ గాంధీ జోడో యాత్రను సక్సెస్ చేస్తూనే.. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని చేయాలని నిర్ణయం తీసుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్మరింత స్పీడ్పెంచుతోంది. ఓ వైపు రాహుల్ గాంధీ జోడో యాత్రను సక్సెస్ చేస్తూనే.. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని చేయాలని నిర్ణయం తీసుకుంది. రోజువారీగా ఉదయం, సాయంత్రం వేళల్లో బైపోల్ ప్రచారం చేయనున్నారు. అంతేకాకుండా ఒక బృందం రాహుల్వెంట ఉంటే.. మరో బృందం ఉప ఎన్నిక ప్రచారం చేయనున్నారు. ఉదయం ఓ టీం.. సాయంత్రం మరో టీం.. ఇలా ప్రచారాన్ని చేపట్టనున్నారు.
మూడు రోజులే కీలకం
వచ్చేనెల 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌జరగనుండగా.. నవంబర్ 1న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ఈ మూడు రోజులు కాంగ్రెస్‌పార్టీ కీలకంగా తీసుకుంటోంది. భారత్ జోడో యాత్ర ప్రారంభం తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌సహా ముఖ్య నేతలు మునుగోడుకు వెళ్లలేదు. అయితే, ప్రచారం కీలక దశకు చేరుతుండటంతో కీలక నేతలు వంతుల వారీగా ప్రచారానికి దిగుతున్నారు.
ఆపరేషన్ ఫాంహౌస్ అస్త్రం
ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్నడుస్తోంది. ఓ పార్టీపై మరో పార్టీ కోర్టు మెట్లు ఎక్కుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల వ్యవహారాన్ని కాంగ్రెస్అనుకూలంగా మల్చుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. దీన్ని వ్యూహం ప్రకారం ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఉప ఎన్నిక పోలింగ్సమయంలో దీన్ని ప్రధానాస్త్రంగా తీసుకుని, విస్తృతంగా గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారం హస్తం పార్టీకి కలిసి వస్తుందనుకుంటున్నారు. దీనికి తోడుగా రాష్ట్ర అధికార పార్టీ కూడా మునుగోడులో కాంగ్రెస్‌కు రెండో స్థానం వస్తుందంటూ ప్రకటించడం కూడా అనుకూలంగా మల్చుకుంటున్నారు. ఇప్పుడు తమదే గెలుపు అని, ఓటర్లు తమవైపు ఉన్నారనే ప్రచారాన్ని ఎక్కువగా చేయనున్నారు.
విడుతలుగా ప్రచారం
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న పార్టీ నేతలు.. శనివారం నుంచి మునుగోడు బాట పట్టనున్నారు. ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు సెగ్మెంట్‌లో ప్రచారం చేసి, సాయంత్రం 4 గంటల వరకు జోడో యాత్రకు రానున్నారు. ఇదే సమయంలో ఉదయం నుంచి జోడో యాత్రలో ఉండే సీఎల్పీ నేత భట్టి వంటి నేతలు సాయంత్రం సెషన్మునుగోడుకు వెళ్లనున్నారు. ఇలా ప్రచారపర్వాన్ని స్పీడ్పెంచుతున్నారు. మొన్నటిదాకా రాహుల్‌గాంధీ వెంట కర్ణాటక రాష్ట్రంలో తిరిగిన ఏఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పుడు మునుగోడు ప్రచారంలో ఉన్నారు. ఇలా పార్టీ నేతలంతా మునుగోడుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌పార్టీ సీనియర్లు, టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి కోసం దాదాపు 600 ఎకరాల్లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఇక్కడ పార్టీ నేతలు బస చేయడమే కాకుండా.. అత్యవసరంగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు ఒకేసారి 600 మందితో సమావేశమయ్యేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
నెంబర్‌టూ ప్రకటనతో జోష్
మొన్నటిదాకా మునుగోడు సెగ్మెంట్‌లో నిదానంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అధికార టీఆర్ఎస్ప్రకటనతో జోరు పెంచింది. జిల్లాల నుంచి పార్టీ నేతలు కూడా ఇటే మకాం వేశారు. తాజాగా ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో అధికార పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్.. తమకు కాంగ్రెస్‌తోనే పోటీ అన్నట్టుగా కామెంట్చేశారు. దీంతో కాంగ్రెస్అభ్యర్థి గెలుస్తారనే ప్రచారాన్ని హస్తం నేతలు మరింతగా ఓటర్లకు వివరిస్తున్నారు.
Read more:
1.ఆపరేషన్ ఫామ్ హౌస్' రిమాండ్ రిపోర్టులో పోలీసుల చెప్పింది ఇదే..
2.ట్విట్టర్ ద్వారా పోరుకు శ్రీకారం.. మేడిగడ్డ బాధితుల కొత్త పంథా