Kishan Reddy : విశ్వకర్మ పథకం లక్ష్యం నీరుగారిపోతుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం నీరుగారిపోతుందని అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-11-08 06:36 GMT

దిశ, వెబ్ డెస్క్ :. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం నీరుగారిపోతుందని అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)ఆగ్రహం వ్యక్తం చేశారుకిషన్ రెడ్డి అధ్యక్షతన బేగంపేట్ టూరిజం ప్లాజాలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి దిశా కమిటీ(Disha Committee) సమావేశమైంది. సమావేశంలో కిషన్ రెడ్డి పలు కేంద్ర పథకాల పురోగతిని సమీక్షించారు. విశ్వకర్మ పథకానిక 18000 వేల దరఖాస్తులు వస్తే కేవలం 620 మంది లబ్దిదారులకు మాత్రమే అందడం సిగ్గుచేటని మండిపడ్డారు. 45రోజుల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేయకపోతే యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

టెక్నీకల్ సమస్యల పేరుతో పథకం మంజూరీని ఆలస్యం చేయడం తగదన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. రైల్వే ప్రాజెక్టులు, జాతీహ రహదారులు, అమృత్ స్కీమ్, ప్రధాన మంత్రి హౌసింగ్ స్కీమ్ వంటి కేంద్ర పథకాలపై కిషన్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


Tags:    

Similar News