Seethakka : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం దారుణం: గాంధీలో సీతక్క సంఘీభావం

కోల్‌కత్తాలో మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు నిరసనలు చేపట్టారు.

Update: 2024-08-14 08:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కోల్‌కత్తాలో మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళన చేపట్టారు. అయితే గాంధీలో ఓ రోగిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్క.. నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. కోల్‌కత్తా ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని సీతక్క తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు దేవతతో సమానమని, ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మహిళలను మధ్య యుగాలకు తీసుకువెళ్తుందని మండిపడ్డారు.

కలకత్తాలో వైద్యురాలిపై హత్యాచారం దారుణమని, వైద్యులకు అండగా మేము నిలబడతాము.. తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించాలి అని నేర్పిస్తామని హమీ ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదని అన్నారు. మహిళా రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత మహిళా భద్రత పై ప్రతి ఒక్కరి ఆలోచన మారాలన్నారు. అందుకోసం కృషి చేస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు మా ప్రభుత్వం కట్టుబడిందని. అలాగే మహిళా భద్రత పై కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. కఠినమైన చట్టాలను అమలు చేయడంతో పాటు ఇలాంటివి జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి‌తో కలిసి మహిళా భద్రతకు కృషి చేస్తామన్నారు. వైద్యుల భద్రత మనందరి బాధ్యత అని, బాధితుల కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో భద్రత చాలా ముఖ్యమని, దాని కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News