టీ.కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు వీళ్లేనా.. సోషల్ మీడియాలో జాబితా వైరల్?
లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థులను ఎంపికపై ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థులను ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో జాబితా వైరల్‌గా మారింది. ఈ జాబితాలో అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు ఉన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్చ తీసుకుని అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మరి వీరిలో ఎంతమందిని ఫైనల్ చేస్తారో చూడాలి.
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీళ్లే :
చేవెళ్ల- పట్నం సునీతా రెడ్డి(వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్)
సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్ (మాజీ మేయర్)
మెదక్- మైనంపల్లి హనుమంతరావు (మాజీ ఎమ్మెల్యే)
జహీరాబాద్ – సురేశ్ షెట్కార్ (మాజీ ఎంపీ)
నిజామాబాద్ – జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
ఆదిలాబాద్ – రేఖా నాయక్ (మాజీ ఎమ్మెల్యే)
మహబూబాబాద్ – బలరాం నాయక్(కేంద్ర మాజీ మంత్రి)
వరంగల్ – అద్దంకి దయాకర్
పెద్దపల్లి – వెంకటేశ్ నేత (సిట్టింగ్ ఎంపీ)
మల్కాజ్ గిరి – కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (అల్లు అర్జున్ మామ)
ఖమ్మం – పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా కుసుమ కుమార్
హైదరాబాద్ – సమీర్ ఉల్లా(మైనార్టీ నేత)
నాగర్ కర్నూల్ – సంపత్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే) లేదా మల్లు రవి(కాంగ్రెస్ సీనియర్ నేత)
నల్గొండ – రేసులో జానారెడ్డి (మాజీ మంత్రి), పటేల్ రమేష్ రెడ్డి
భువనగిరి – రేసులో కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి(డాక్టర్), చామల కిరణ్ కుమార్ రెడ్డి
కరీంనగర్ – రేసులో ప్రవీణ్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), రాజేందర్ రావు
మహబూబ్ నగర్ – చల్లా వంశీ చంద్ రెడ్డి (లోక్ సభ అభ్యర్థి)