బతుకులు మారుతాయనే ఆశతో అడవిలో 16 కి.మీ కాలినడకన వచ్చి ఓటు

ఓటు హక్కు వినియోగించుకునేందుకు 16 కి.మీ అడవిమార్గంలో రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Update: 2024-05-13 12:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓ వజ్రాయుధం లాటింది. తమ భవిష్యత్ ను నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొంత మంది బద్దకిస్తుంటే ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామస్తులు మాత్రం 16 కిలో మీటర్లు అటవీ గుండా కాలినడకన వచ్చి తమ ఓటును వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో పోలింగ్ బూత్ లేకపోవడంతో వారి ఓట్లు వాజేడులో ఉన్న పోలింగ్ కేంద్రంలో తమ ఓటు వేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... తమ గ్రామానికి సరైన మౌళిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేక అనారోగ్యంతో వాజేడుకు వచ్చే క్రమంలో అడవి మార్గంలోనే చనిపోయిన వారు చాలా మంది ఉన్నారని ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇకనైనా తమ బతుకులు మార్చాలని కోరారు.

Tags:    

Similar News