Komati Reddy :రీజనల్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ రానుంది : మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister KomatiReddy VenkataReddy) ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు.

Update: 2025-03-11 12:57 GMT
Komati Reddy :రీజనల్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ రానుంది : మంత్రి కోమటిరెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister KomatiReddy VenkataReddy) ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. మంగళవారం మధ్యాహ్నం కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ(Nitin Gadkari), రామ్మోహన్ నాయుడి(RamMohan Naidu)తో కోమటిరెడ్డి భేటీ అయ్యి, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రీజనల్ రింగ్ రోడ్డు(RRR)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని గడ్కరీని కోరగా.. రెండు నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారన్నారు. ఆర్ఆర్ఆర్ కు 95 శాతం భూసేకరణ పూర్తైందని, రూ.1000 కోట్లతో 12 ఆర్వోబీలు మంజూరు అయ్యాయని తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపాక, నిర్వాసితులకు పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్- విజయవాడ ఆరు లైన్ల రహదారికి టెండర్లు పిలవాలని కోరామని, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్(Srishailam Elivated Caridor) ను వేగవంతం చేయాలని విన్నవించినట్టు వెల్లడించారు. హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి(Hyderabad - Machilipatnam) ఆలస్యం అవుతున్న కారణంగా.. గుడి మల్కాపూర్ నుంచి విజయవాడ ఒక కారిడార్ ను, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో కారిడార్ ను నిర్మించాలని తెలిపామన్నారు. అదే విధంగా సోమశిల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

Tags:    

Similar News