జేపీఎస్‌ల సమ్మెపై సర్కార్ సీరియస్.. మంత్రి ఎర్రబెల్లి స్ట్రాంగ్ వార్నింగ్

తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-05-08 11:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మె విషయంపై అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. జేపీఎస్‌ల సమ్మె వ్యవహారంలో కఠినంగా ఉండాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. రేపటిలోగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకపోతే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

Also Read..

రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలుసు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి 

Tags:    

Similar News