జైనూరు ఘటనపై ప్రభుత్వం సీరియస్.. చర్యలు ప్రారంభం

జైనూరు ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ అధికారి, డీఎ అసిఫాబాద్ డీఎస్పీ సదయ్యపై విమర్శలు రావడంతో వేటు వేసింది.

Update: 2024-09-06 13:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: జైనూరు ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ అధికారి, డీఎ అసిఫాబాద్ డీఎస్పీ సదయ్యపై విమర్శలు రావడంతో వేటు వేసింది. ఆయన్ను బదిలీ చేసి.. కొత్త డీఎస్పీగా కరుణాకర్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వుల జారీ చేసింది. కాగా, ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచార యత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో బాధిత మహిళ, నిందితుడి తరపు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మరోవైపు, బుధవారం జైనూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


Similar News