దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం.. ఎక్కడో తెలుసా?

దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంను బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Update: 2024-02-05 13:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంను బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిలాశాసనాలు దేశ చరిత్రను, అస్థిత్వాన్ని, ప్రాచీన సంప్రదాయాలను తెలియజేస్తుందని తెలిపారు. ఇలాంటి శిలాశాసనాలను రక్షించుకోవాలన్నారు. గతంలో దేశం మీద దాడి చేసిన మొఘలులు, మహమ్మదీయులు పెద్ద ఎత్తున మనకు తెలియకుండానే అనాగరిక చర్యతో వాటన్నింటిని డిస్ట్రాయ్ చేశారన్నారు. దీంతో మిగిలిపోయిన శాసనాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఎపిగ్రఫీ మ్యూజియంలో రీసెర్చ్ ఓరియెంటెడ్ నాటి శిలాశాసనాలను పరిశోధన చేసి ఆ వివరాలను పుస్తకాల రూపంలో, డిజిటల్ మీడియా రూపంలో ఈతరాని, భావితరానికి అందించే ప్రయత్నం మ్యూజియం చేయబోతోందని చెప్పారు. ఈ ఎపిగ్రఫీ మ్యూజియం అనేది గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇలాంటి మ్యూజియం పెడతామని సీఎం రేవంత్ రెడ్డి కి కూడా అనేక సార్లు ఉత్తరాలు రాశానని గుర్తుచేశారు అనేక ఇతర కార్యక్రమాలకు, పార్టీ ఆఫీసులకు భూములిస్తారు కానీ దేశం గౌరవపడేటువంటి ఇన్స్టిట్యూట్ వస్తుందంటే వారు జవాబు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక కేంద్రమంత్రిగా అడిగినా, ఉత్తరాలు రాసిన కూడా జవాబు కూడా ఇవ్వలేదన్నారు. భూమి ఇస్తే పెద్ద క్యాంపసే వచ్చేదని, చివరకు తన శాఖ ఆధీనంలో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియంలో పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మ్యూజియం ద్వారా మనదేశంలో ఉన్న లక్షలాది ప్రాచీన శిలాశాసనాలన్నింటినీ కూడా పొందుపరిచే ప్రయత్నం చేస్తామన్నారు. డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని కూడా చాలా వేగవంతంగా హైదరాబాద్ నగరంలో చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో కంటే ది బెస్ట్ ఎపిగ్రఫీస్ మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు.

Tags:    

Similar News