Floods:మున్నేరుకు భారీ వరద..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద నీరు ముంచెత్తింది.

Update: 2024-09-08 04:08 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్నేరు(Munneru) పరివాహక ప్రాంతం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఈరోజు రాత్రికి మళ్లీ వరద(Floods) నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద(Floods) నీరు పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక(warning) జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంతం ప్రజలను పోలీసులు అప్రమత్తం(Alert) చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను(Victims) పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.


Similar News