ఒకేసారి 9 బ్రహ్మ కమలాల వికాసం.. పూజలు నిర్వహించిన గ్రామస్తులు

హిమాలయ పర్వతాలు, శీతల ప్రదేశాలలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన బ్రహ్మకమలాలు బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని పొట్టి పల్లి గ్రామంలో కనువిందు చేశాయి.

Update: 2024-09-26 06:27 GMT

దిశ, ఝరాసంగం: హిమాలయ పర్వతాలు, శీతల ప్రదేశాలలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన బ్రహ్మకమలాలు బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని పొట్టి పల్లి గ్రామంలో కనువిందు చేశాయి. గ్రామానికి చెందిన విజయలక్ష్మి భీమ్ రావు కులకర్ణి ఇంటి ఆవరణలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒకేసారి 9 బ్రహ్మ కమలాలు వికసించాయి. దీంతో విజయలక్ష్మి భీమ్ రావు దంపతులతో పాటు గ్రామస్తులు చెందిన పలువురు మహిళలు బ్రహ్మ కమలాలకు ప్రత్యేక పూజలు మంగళ హారతులు నిర్వహించారు. గురువారం ఉదయం బర్దిపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మ కమలాల వికాసంతో గ్రామం మొత్తం సుగంధపు వాసన వెదజల్లింది. కాగా సూర్యోదయంతో వికసించేది తామర పుష్పం అయితే, చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగింది ఒక్క బ్రహ్మ కమలం మాత్రమే అని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి పేర్కొన్నారు.


Similar News