రాపోలు టీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు

మునుగోడు ఉపఎన్నిక వేళ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌కు బీజేపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

Update: 2022-10-24 06:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉపఎన్నిక వేళ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌కు బీజేపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. బుధవారం బీజేపీకి గుడ్ బై చెప్పి అదే రోజు అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాగా, ఇప్పటికే దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్‌, బూడిద భిక్షమయ్య గౌడ్‌లు టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులు, పద్మశాలీలు ఉన్న నేపథ్యంలో ప్రముఖ పద్మశాలీల నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్‌ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాపోలు ఆనంద భాస్కర్‌ బీజేపీలో చేరారు. 2012-18లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాపోలు ఆనంద్‌ భాస్కర్‌.. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకోవడం ఆసక్తికర పరిణామాలకు దారి తీసింది.

Tags:    

Similar News