కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 60 మందితో తొలి జాబితా..!

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అక్టోబరు ఫస్ట్ వీక్‌లో విడుదల చేయనున్నది. రెండు రోజులుగా ఢిల్లీలోని వార్ రూమ్‌లో జరుగుతున్న స్క్రీనింగ్

Update: 2023-09-22 03:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అక్టోబరు ఫస్ట్ వీక్‌లో విడుదల చేయనున్నది. రెండు రోజులుగా ఢిల్లీలోని వార్ రూమ్‌లో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 60 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. ఇందులో దాదాపు 30-35 స్థానాల్లో ఒకే అభ్యర్థి టికెట్ రేసులో ఉన్నారు. వీటిపై ఇప్పటికే క్లారిటీ రాగా దాదాపు 25-30 స్థానాల్లో ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో వాటిని కూడా ఈ సమావేశం దాదాపుగా కొలిక్కి తెచ్చింది. మొత్తంగా సుమారు 60 మంది అభ్యర్థుల పేర్లు ఒక మేరకు ఖరారయ్యాయి. ఈ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు స్క్రీనింగ్ కమిటీ పంపనున్నది. ఈనెల చివరికల్లా ఖరారు చేసి ఏఐసీసీ ద్వారా అక్టోబరు ఫస్ట్ వీక్‌లో లాంఛనంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

సర్వే, ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫైనల్

అభ్యర్థులను ఫైనల్ చేసే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు జిగ్నేశ్ మెవానీ, సిద్దికీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే, రాష్ట్ర నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఇప్పటివరకు జరిగిన సర్వే, స్థానిక పరిస్థితులు, నియోజకవర్గం నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సునీల్ కనుగోలు నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఫైనల్ చేసినట్లు తెలిసింది.

ఢిల్లీలోనే ఆశావహులు

దాదాపు 40కు పైగా స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల పేర్లను పీసీసీ ఇప్పటికే షార్ట్ లిస్టు చేసి స్క్రీనింగ్ కమిటీకి అందజేయడంతో వీటిపైనా చర్చ జరిగింది. రెండు రోజుల భేటీలో దాదాపు 60 మంది పేర్లు ఖరారైనందున మిగిలిన స్థానాలపై నేడు సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. మరోవైపు టికెట్ ఆశిస్తూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలు నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఏఐసీసీ సీనియర్ నేతలను కలిసి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Read More..

యూత్, నిరుద్యోగులే టార్గెట్‌గా టీ- కాంగ్రెస్ భారీ స్కెచ్..!  

ఎన్నికల వేళ సర్వేల జోరు.. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు  

Tags:    

Similar News