‘బీఆర్ఎస్ నేతల కరప్షన్‌ని సీఎం ఆపలేకపోయారు’

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని సీఎం కేసీఆర్ ఆపలేకపోయారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మండిపడ్డారు.

Update: 2023-04-29 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని సీఎం కేసీఆర్ ఆపలేకపోయారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మండిపడ్డారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని నిజానికి ఈ వసూళ్ల పర్వం దళిత బంధుకే పరిమితం కాలేదన్నారు. అనేక చోట్ల ఎమ్మెల్యేలు ఇసుక దందాలు, భూ దందాలతో రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ జన సమితి ఐదవ ఆవిర్భావ వేడుకలు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగాయి.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన కోదండరామ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రజా సమస్యలపై టీజేఎస్ నిర్విరామ పోరాటం చేసిందని గుర్తు చేశారు. తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో టీజేఎస్ స్పష్టమైన ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇప్పటికే అనేక నియోజకవర్గంలో తమ పార్టీ బలోపేతం అయిందని, వచ్చే జూన్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ నిర్వహించుకుంటామన్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల్లో మరింత విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

రేపు పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఉందని ఆ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ నైతిక పతనాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో రైతులు పంట నష్టపోతే ప్రభుత్వంలో చలనం లేదని పంట నష్టంపై సర్వేలు సక్రమంగా జరగడం లేదన్నారు. ధర్నాలు చేసినా టీఎస్‌పీఎస్సీ అంశంపై ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగడం విమర్శించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..