రూ.7 కోట్ల విలువ చేసే నగలతో కారు డ్రైవర్ పరార్
బంగారం వ్యాపారి వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్ యజమానికి బిగ్ షాక్ ఇచ్చాడు.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బంగారం వ్యాపారి వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్ యజమానికి బిగ్ షాక్ ఇచ్చాడు. రూ.7 కోట్ల విలువ చేసే నగలతో పరారయ్యాడు. ఈ సంఘటన సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. మాదాపూర్‌కు చెందిన రాధిక బంగారు నగల వ్యాపారం చేస్తోంది. మధురానగర్‌లో ఉంటున్న కస్టమర్‌కు చూపించేందుకు శుక్రవారం రాత్రి రూ.7 కోట్ల విలువ చేసే బంగారు నగలు, డైమండ్ నెక్లెస్‌ను కారులో తీసుకొని వచ్చింది. రాధిక ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని అవకాశంగా చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.