కాంగ్రెస్ ఆశవాహులకు బిగ్ అలర్ట్.. కార్పొరేషన్ చైర్మన్ల జీవోలు రెడీ..!

కార్పొరేషన్ చైర్మన్ల పదవుల జీవోలు సిద్ధమైనట్లు తెలిసింది. నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. గతంలో ప్రకటించిన 37

Update: 2024-07-02 15:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కార్పొరేషన్ చైర్మన్ల పదవుల జీవోలు సిద్ధమైనట్లు తెలిసింది. నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. గతంలో ప్రకటించిన 37 మంది జాబితాకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అయితే ఈ లిస్టులో ముగ్గురి నుంచి నలుగురి పేర్లలో మార్పులు ఉండే ఛాన్స్ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా నేతలకు ఎమ్మెల్సీల హామీలు ఇవ్వడంతో తమకు కార్పొరేషన్‌లకు బదులుగా ఇతర పదవులు ఇవ్వాలని ఇటీవల సదరు నేతలు సీఎంకు రిక్వెస్ట్ పెట్టారు. దీంతో ఆయా లీడర్ల పేర్లు హోల్డ్‌లో ఉండనున్నాయి. మిగతా నేతలందరికీ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, చైర్మన్‌ల ప్రోటోకాల్, ఆఫీస్ తదితర అంశాలపై సంబంధిత శాఖలకు ప్రభుత్వం నుంచి ఆఫీషియల్‌గా ఆర్డర్లు వెళ్లనున్నాయి.

Similar News