పాదయాత్రకు అనుమతివ్వండి.. డీజీపీకి బీజేపీ నేతలు విజ్ఞప్తి

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 14వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న

Update: 2022-04-08 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 14వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ శ్రేణులు శుక్రవారం డీజీపీని కలిశాయి. పాదయాత్రకు అనుమతితో పాటు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 14వ తేదీన ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రతిరోజు 13 నుంచి 15 కిలోమీటర్లు సాగుతుందని చెప్పారు.జోగులాంబ గద్వాల్‌ జిల్లా ఆలంపూర్‌లో ఈ యాత్ర ప్రారంభమై రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్ర ప్రభుత్వ నిబంధనలు, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్‌శాఖ నుంచి అన్ని చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. డీజీపిన కలిసిన వారిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్​​ప్రభాకర్​తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News