ఉత్తమ పోలీసులకు మెడల్స్
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్స్, గ్యాలంటరీ పతకాలను ప్రకటించింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్స్, గ్యాలంటరీ పతకాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి 34మంది పోలీసు సిబ్బందికి ఈ పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి మెరిటోరియస్ మెడల్స్ సాధించిన వారిలో హైదరాబాద్ కమిషనరేట్లో ఏఎస్సైగా పని చేస్తున్న సాయన వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీలు (అడ్మిన్) కొమ్మిశెట్టి రామకృష్ణ, ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజర్వ్ అందోజు సత్యనారాయణ, వరంగల్‌లో అసిస్టెంట్ ఎస్సైగా పని చేస్తున్న కక్కెర్ల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా ఆర్ఐ అజెల్ల శ్రీనివాసరావు, సీనియర్ కమాండో రాసమోని వెంకటయ్య, హైదరాబాద్ లో సీఐగా పని చేస్తున్న అరవేఇ భాను ప్రసాదరావు, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్సై మహంకాళి మధు ఉన్నారు.
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్
ఇక, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ సాధించిన వారిలో అదనపు డీజీ విజయ్ కుమార్, ఎస్పీ మాదాడి రమణ ఉన్నారు.
గ్యాలంటరీ అవార్డులు
ఇక, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డులు పొందిన వారిలో ఎస్పీ భాస్కరన్, హెడ్ కానిస్టేబుల్ కే.అశోక్, పోలీస్కానిస్టేబుళ్లు సందీప్‌కుమార్, కార్తిక్, మధు, సంపత్, సుశీల్ (చనిపోయారు), సునీల్ కుమార్, సుకుమార్, మహేందర్‌రావు, బక్కెర శివకుమార్, కళ్యాణ్‌కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్రమేశ్, ఆర్ఐ రమేశ్, ఆర్ఎస్సైలు మహేశ్, నాగుల్‌మీరా, హెడ్కానిస్టేబుల్ఆదినారాయణ, సీఐలు పురుషోత్తంరెడ్డి, శివప్రసాద్, ఎస్సై బండారి కుమార్ఉన్నారు.