తెలంగాణకు మెడికల్ కాలేజీలు కేటాయించకపోవడానికి కారణమిదే!

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ పై కేంద్రం చేసుకుంటున్న విమర్శలు రాజకీయ రణరంగాన్ని

Update: 2022-03-26 07:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ పై కేంద్రం చేసుకుంటున్న విమర్శలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. కేంద్రంతో కొట్లాడుతాం.. ధాన్యం కొనుగోళ్లు జరిపేలా చూస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన వేళ.. మంత్రుల బృందం కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజుల క్రితం పార్లమెంట్‌లో ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం ఇచ్చిన సమాధానంతో తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. కేంద్రం రాసిన లేఖలను పంచుకుంటూ '' పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుండి రాలేదని అసత్యాలు చెప్పగా, నేడు మెడికల్ కాలేజీల కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని మరోసారి అబద్ధాలు చెప్పారు. ఇది చాలా దారుణం, బాధాకరం.'' అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆలేటి రాజేశ్ సాగర్ స్పందించారు.

జూలై 2021లో కేంద్రం నుంచి ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పొందుపరుస్తూ మంత్రి హరీష్ రావుకు సూటి ప్రశ్నలు వేశారు. ఆర్టీఐ ప్రకారం.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నుంచి 2019 ఆగస్టులో ఓ లెటర్ వచ్చిందని, అందులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఫేజ్-3లో భాగంగా అన్ని రాష్ట్రాలు కాలేజీల ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేసి పంపించాలని కోరారు. అయితే, దీని గురించి 2021 జూలై నెలలో తీసుకున్న ఆర్టీఐలో కేంద్ర వైద్య శాఖ ఇచ్చిన సమాధానం చూసి రాష్ట్రప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తం 74 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ఫేజ్ -3లో అనుమతులిచ్చామని, డీపీఆర్ పంపాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశామని, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన కానీ, డీపీఆర్ కానీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వానికి కేంద్రం నుంచి వచ్చే కొద్దిపాటి లాభాలు కూడా కోల్పోతున్నామని నెటిజన్లు మండిపడుతున్నారు.

Tags:    

Similar News